ఆటోపము
జులై 26, 2022
ఆటోపము (āṭōpamu)
అర్థము
(విశేష్యము): తొందరపాటు; వేగిరపాటు; గర్వము; ఉబుకుట; భేషజము; కపటము
Meaning
(noun) : hastiness; excess; pride; arrogance; swelling; pomp
వాడుక / Usage
చట్ట సభలో ఆధిక్యత ఉన్నందున ప్రభుత్వ చర్యలు ఆటోపముగా ఉన్నాయి.
Owing to its brute majority in the legislature the government actions are arrogant.
మెదడుకు మేత / Food for thought
ఎడారిలో కోయిల
తెల్లారని రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటి పాట
ఎదవీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నాదేవత
కల ఐతే శిల ఐతే మిగిలింది ఈ గుండెకోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత
విధిరాత చేత నా స్వర్ణసీత
ఆ రూపమే నాదీపమై
వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా
వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై
చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతికంటే
చేదైన ఒకతీపిపాట
చెలిలేని పాట ఒక చేదుపాట
-- పంతులమ్మ, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment