ఆమ్రేడనము

 

జులై 27, 2022

ఆమ్రేడనము (āmrēḍanamu)

    అర్థము

   (విశేష్యము): రెండూ మూడు సార్లు చెప్పుట; మళ్ళీ మళ్ళీ చెప్పుట; స్తుతించుట

   Meaning

   (noun) : reiteration; repetition; praising

   వాడుక / Usage

  వ్యవస్థలను, సిద్ధాంతాలను కాక వ్యక్తులను నిత్యం ఆమ్రేడనము చేయడం మన దుస్థితి.
 Praising/worshiping individuals rather than systems or ideologies is our bane.

   మెదడుకు మేత / Food for thought

జీవితానందం ఎక్కడున్నదో తెలుసా? అంతటిని వదలడంలో ఉన్నది, దేనిని పోందకపోవడంలో ఉన్నది. అందడం పొందడం అనే స్పృహ అసలు లేకపోవడంలో ఉన్నది. దేని లెక్కలోను లేకపోవడంలో ఉన్నది. చూసిందంతా ఒక కలలా దిగ్గున మళ్ళీ మళ్ళీ లేచి కూచోడంలో ఉన్నది. పొందడం ఏనాడూ ఆనందం కాదు. అది ఏనాటికయినా వెళ్ళిపోయేదేననే కొత్త ఆలోచన ఇచ్చే భయం. ఖోనేవాలేహీ పానేవాలే హోతేహై సూత్రాన్ని కూడా కాదని దేనిని ఎవరిని ఆశించకపోవడంలో ఉన్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక ఊహ ఉదయిస్తుంది. ప్రతి ఉదయం ఆ ఊహ తను ఒక పిట్ట రూపు ధరించి నా మంచం కోడుపై వాలి ఇలా పాడుతుంది: టుడేస్ సాడ్‌నెస్ హాజ్ బీన్ కాన్సల్‌డ్!

-- రచయత అన్వర్ (eemata.com జులై 2018 సంచిక)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి