ఉంకించు
జులై 28, 2022
ఉంకించు (unkinṭchu)
అర్థము
(క్రియ): ప్రయత్నించు; ఆరంభించు; సిద్ధముగా ఉండు; దూకడానికి పూను
Meaning
(verb) : try; start; to be ready; crouch ready to jump
వాడుక / Usage
మంద నుండి వేరైన లేగ దూడపైకి దూకడానికి పొదల్లో పొంచిఉన్న పులి ఉంకించి ఉంది.
The stalking tiger crouched ready to jump onto the calf separated from the herd.
మెదడుకు మేత / Food for thought
ఒంటరిగా ఉండనీండి! ఒదిలిపెట్టి పోండి!
తళుకు తళుకుమని మెరిసే తారకలను తిలకిస్తూ
హడావుడిగ పరిగెత్తే మొయిళ్ళను వీక్షిస్తూ
ఉద్వేగపు శిలపై ఉత్సాహపు ఉలితో చెక్కిన
ఊహా మూర్తులకు ఊపిరి పోసుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
ఉన్మాదోత్తుంగ తరంగ తాళ బద్ధమౌ
సాగర గళోద్భూత సంగీతం వింటూ
మానసోద్యానంలో పరవశాన విహరించే
పచ్చని భావవిహంగానికి పాట నేర్పుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
అరుణ కిరణ మృదు స్పర్శా పులకిత సరసీరుహాల
శరత్జ్యోత్స్నా చుంబిత పంకజాల పరికిస్తూ
మదీయ హృదయ స్పందనా సరోవరంలో విరిసిన
కవితా కల్హారాలను కనుల కద్దుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
తళుకు తళుకుమని మెరిసే తారకలను తిలకిస్తూ
హడావుడిగ పరిగెత్తే మొయిళ్ళను వీక్షిస్తూ
ఉద్వేగపు శిలపై ఉత్సాహపు ఉలితో చెక్కిన
ఊహా మూర్తులకు ఊపిరి పోసుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
ఉన్మాదోత్తుంగ తరంగ తాళ బద్ధమౌ
సాగర గళోద్భూత సంగీతం వింటూ
మానసోద్యానంలో పరవశాన విహరించే
పచ్చని భావవిహంగానికి పాట నేర్పుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
అరుణ కిరణ మృదు స్పర్శా పులకిత సరసీరుహాల
శరత్జ్యోత్స్నా చుంబిత పంకజాల పరికిస్తూ
మదీయ హృదయ స్పందనా సరోవరంలో విరిసిన
కవితా కల్హారాలను కనుల కద్దుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
-- ఎరికలపూడి వాసుదేవరావు (eemata.com జులై 2022 సంచిక)
Comments
Post a Comment