బుగ్గ
జులై 08, 2022
బుగ్గ (bugga)
అర్థము
(విశేష్యము): చెంప; పర్వతాల్లో పైకి నిరంతరంగా ఉబికే నీరు; చిన్న వాగు; వదంతి వ్యాపించడం; లాంతరుకు వేసే గ్లాసు; బుడగ
Meaning
(noun) : cheek; spring; fountain; balloon
వాడుక / Usage
ముందుచూపు లేకుండా కొండలు కొట్టడం వల్ల ఎన్నో బుగ్గలు బుగ్గిపాలు అవుతున్నాయి.
Mindless destruction of hills is drying out many a spring.
మెదడుకు మేత / Food for thought
నాటోకి టర్కీ చాలా ముఖ్యమైన దేశం. ఎందుకంటే నల్ల సముద్రం (బ్లాక్ సీ) యొక్క ప్రవేశం, నిష్క్రమణని సన్నని బోస్ఫరస్ జలసంధి ద్వారా నియంత్రిస్తుంది కనుక. మైలు కన్నా తక్కువ వెడల్పు ఉన్న ఆ సంధిని మూసివేస్తే రష్యాకి చెందిన బ్లాక్ సీ నౌకా దళం, మధ్య ధరా సముద్రం లోకి ఆపైన అట్లాంటిక్ మహాసాగరంలోకి వెళ్ళలేవు. భౌగోళికంగా రష్యాకి సంవత్సరం పొడుగూతా వాడగలిగిన ఓడ రేవు కేవలం నల్ల సముద్రంలోనే ఉంది.
-- ప్రిజనర్స్ ఆఫ్ జాగ్రఫీ, టిమ్ మార్షల్
Comments
Post a Comment