నలుగడలు
సెప్టెంబర్ 01, 2022
నలుగడలు (nalugadalu)
అర్థము
(సమాసము): నలు =నాలుగు; కడలు =దిక్కులు; నాలుగు ప్రక్కలు/వైపులు/దిక్కులు
Meaning
(Compound) : all sides; all around; surrounded by
వాడుక / Usage
కౌరవ సైన్యం నలుగడలు రక్షింపగా జయద్రధుడు పద్మవ్యూహంలో సూర్యాస్తమయం కొరకు ఎదురు చూసాడు.
Protected by Kauravas on all sides, Jayadratha hidden in Padmavyuha, waited for Sun set.
మెదడుకు మేత / Food for thought
ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతుల కోసితెచ్చు పుణ్యాత్ముడా!నీకు మోక్ష మెటులబ్బును? నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే?
చరాచరవర్తి ప్రభుడు మా పవిత్రాత్మల నందుకోడే!
నడమంత్రపు నీ తగులాటంవేటికిన్?
ఊలు దారాలతో గొంతుకురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము
అకటా! దయలేనివారు మీ ఆడువారు
-- పుష్ప విలాపం, కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912, 1992)
Comments
Post a Comment