పొత్తము
సెప్టెంబర్ 12, 2022
పొత్తము (pottamu)
అర్థము
(విశేష్యము): పుస్తకం; కావ్యం; ప్రబంధం; సమూలము
Meaning
(noun) : book; poem; treatise
వాడుక / Usage
ధర్మారావు చెవి యొగ్గి వినెను. మూడు కొట్టెను. దీపము తగ్గించి పొత్తము దూరము నందుంచి చూచెను.
Dharma Rao listened keenly. Clock struck three. He turned the lamp down, put the book away and gazed.మెదడుకు మేత / Food for thought
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ
బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బందింపలేను హృదయము సంకెల చేసి
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ
-- మేఘ సందేశం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)
Comments
Post a Comment