దీధితి
సెప్టెంబర్ 13, 2022
దీధితి (dīdhiti)
అర్థము
(విశేష్యము): కిరణము; కాంతి; వెలుగు; దీప్తి
Meaning
(noun) : ray of light; brightness; splendour
వాడుక / Usage
ఒకానొకని మొగమందు సునిశితములై దిధీతిమయమైన నేత్రములుండును. అట్లే కృష్ణదేవరాయల గొప్పదనమంతయు ఆయన వర్ణనలలో నున్నది.
Someone's eyes might be the splendour of their face. Similarly Krishnadevaraya's greatness lies in painting pictures with words.
మెదడుకు మేత / Food for thought
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే ఏ
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే ఏ
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరు కరువాయే
చేరదీసి సేవచేసే తీరు కరువాయే నీ దారే వేరాయే
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
మరుపురాని బాధ కన్నా మధురమే లేదు
మరుపురాని బాధ కన్నా మధురమే లేదు
గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు
గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు
అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా
రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా
దారిలేని భాదతో నేనారిపోయెనా కధ తీరిపోయేనా
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే
-- దేవదాసు, సముద్రాల రాఘవాచార్యులు (జులై 19, 1902 - 1968)
Comments
Post a Comment