సకృత్తు

 

సెప్టెంబర్ 14, 2022

సకృత్తు (sakṛittu)

    అర్థము

   (విశేషణము): ఎప్పుడైనా ఒకసారి; అరుదుగా; అపురూపముగా; ఒక పర్యాయము

   Meaning

   (adverb) : rarely; seldom; scarcely

   వాడుక / Usage

 గణాచారి ఎప్పుడునూ బయటికే రాదు. ఇట్టి సంఘటనలు జరిగినపుడే వచ్చును. అవి సకృత్తుగా జరుగును.
 Ganachari never comes out. He comes only when such incidents happen. And they are rare.

   మెదడుకు మేత / Food for thought

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద 
చింతనా మృత పాన విశేషమత్త 
చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?
వినుత గుణసీల ! మాటలు వేయునేల ?

(మందార పువ్వుల తేనెల మాధుర్యానికి అలవాటు పడ్డ తుమ్మెద ఉమ్మేత్తు చెట్ల వైపుకు పోవునా? స్వచ్చమయిన నిర్మల మయిన గంగానదిలో తేలియాడు రాజ హంసలు వాగులకు వంకలకు పోవునా ? లేత మామిడి చిగుళ్ళు ఆరగించు కోయిలలు .కొండ మల్లెలు మ్రింగునా ? నిండు పున్నమిలో విహరించు చకోర పక్షులు పొగమంచు దరికి చేరునా ? అలా చేయవు. వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. )


--మహాభాగవతం, బమ్మెర పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి