నెరియ

 

సెప్టెంబర్ 15, 2022

నెరియ (neriya)

    అర్థము

   (విశేష్యము): నేల పగులు; బీటిక; పూర్తిగా; బొత్తిగా

   Meaning

   (noun) : crack; fissure; totally; not at all

   వాడుక / Usage

 మాగాని కోసిన పొలము లన్నియు నెఱియలు పడి వెచ్చని యావిరి వదులుచుండెను.
 Cracks in the fields, where the crop was harvested, were steaming.

   మెదడుకు మేత / Food for thought

ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా
బడులే లేని పల్లెటూళ్ళలో
బడులే లేని పల్లెటూళ్ళలో
చదువే రాని పిల్లలకు
చదువు రాని చదువుల బడిలో
జీతాలు రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
చాలీ చాలని పూరి గుడిసెలో
చాలీ చాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలి అయిపోయిన పడతులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
కూలి డబ్బుతో లాటరీ టికెట్
లాటరీ టికెట్
కూలి డబ్బుతో లాటరీ టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరిచి
చెడే నిరాశా జీవులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
సేద్యం లేని బీడు నేలలో
సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
--భూమి కోసం, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి