కైవారము

 

సెప్టెంబర్ 16, 2022

కైవారము (kai-vāramu)

    అర్థము

   (విశేష్యము): పొలంలో మళ్ల అంచు; చుట్టుకొలత; నమస్కారం; స్తోత్రం; పొగడ్త

   Meaning

   (noun) : circumference; circle; border around a field; praise; flattery

   వాడుక / Usage

 ప్రక్కనున్న బల్లమీద రంగారావుగారి ఛాయాపటము దంతపు కైవారమునం దిముడ్చబడి యుండెను.
 On the table next to her Rangarao's picture sat in a round ivory frame.

   మెదడుకు మేత / Food for thought

తలదించుకు  బతుకుతావ
తలఎత్తుకు తిరగలేవ
తలరాతను మార్చుకోవ... సిగ్గనేది లేదా?

ఒకడిగ నువు పుట్టలేద
ఒకడిగ నువు చచ్చిపోవ
ఒకడిగ పోరాడలేవ... నిద్రలేచి రారా

నీ ఓటుని  నీ వేటుకె  వాడుతుంటె వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నిలదీయవనేరుగా?
ఉడుకెత్తిన  నెత్తురె ఒక   నిప్పుటేరులాగ
కదలిరా...కదలిరా...కదలిరా

పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా

నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెల చప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా....కదల్రా...కదల్రా...ఒరేయ్

దేహానికి హాని అంటె వైద్యమిచ్చుకోవా
దేశానికె జబ్బుచేస్తె నీళ్ళునములుతావా
కదల్రా....కదల్రా...కదల్రా...ఒరేయ్

పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా

తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన... తొలివాడిగ రారా

బిగబట్టిన పిడికిలయ్యి
పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి....ఉద్యమించిలేరా

పోరాడని ప్రాణముంటె అది ప్రాణమె కాదటా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా

కణకణకణ ప్రతికణమున జనగణమన గీతమయ్యి
కదలిరా...కదలిరా...కదలిరా

పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా

--కెమేరామెన్ గంగతో రాంబాబు, భాస్కరభట్ల రవి కుమార్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి