విహితులు

 

సెప్టెంబర్ 19, 2022

విహితులు (vi-hitulu)

    అర్థము

   (విశేష్యము): స్నేహితులు; బంధువులు; ఆప్తులు

   Meaning

   (noun) : friends; relatives; someone very close

   వాడుక / Usage

 దౌత్య సంబంధాల్లో విహితులు ఎవరో విరోధులు ఎవరో తెలుసుకోవడం కత్తి మీద సాము లాంటిది.
 In diplomacy knowing friends from enemies is like walking on a razor's edge.

   మెదడుకు మేత / Food for thought

నీ శత్రువు శక్తి సామర్ధ్యాలు, నీ శక్తీ సామర్ధ్యాలు తెలిసి ఉంటే, నూరు యుద్ధాల పోరాడినా వాటి ఫలితం గురించి భయ పడక్కర్లేదు. నీ గురించి తెలిసి, శత్రువు గురించి అవగాహన లేదో, గెలిచిన ప్రతీ పోరుకీ ఒకటి ఓడతావు. నీ గురించీ అవపోసన లేక శత్రువు గురించీ తెలియలేదో ప్రతీ సమరంలో ఓటమి తథ్యం. 

--ది ఆర్ట్ ఆఫ్ వార్, సన్ జూ (క్రీపూ 544 - 496)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి