ఎరగలిచిచ్చు

 

సెప్టెంబర్ 02, 2022

ఎరగలిచిచ్చు (eragalichicchu)

    అర్థము

   (సమాసము): ఎరగలి = ఎండిన మ్రాను రాసుకుని అడవిలో పుట్టే అగ్ని; చిచ్చు = మంట; దావాగ్ని; కారు చిచ్చు

   Meaning

   (Compound) : forest fire

   వాడుక / Usage

 ఎరగలిచిచ్చులో చిక్కుకున్న ఎలుక  కలుగు త్రవ్వి ప్రాణం కాపుడుకుంటుందని విదురుడు గుర్తుచేశాడు.
 Mouse hides underground to escape the forest fire, reminded Vidura.

   మెదడుకు మేత / Food for thought

       ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
            రా పురవీధుల గ్రాలగలదె
      మణిమయంబగు భూషణ జాలములనొప్పి
            ఒడ్డోలగంబున నుండగలదె
      అతి మనోహరలగు చతురాంగనల తోడి
            సంగతి వేడ్కలు సలుపగలదె
      కర్పూర చందన కస్తూరి కాదుల
            నింపు సొంపార భోగింపగలదె

       కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర
       వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
       సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
       జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము


-- ఉత్తర గోగ్రహణం (ఆంధ్ర మహాభారతం), తిక్కన (1205 - 1288)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి