అలబలము

 

సెప్టెంబర్ 27, 2022

అలబలము (ala-balamu)

    అర్థము

   (విశేష్యము): కలకలం; సద్దు; చప్పుడు; రొద; గొల్లు మను ధ్వని

   Meaning

   (noun) : outcry; noise; clamour; uproar

   వాడుక / Usage

 సభలోకి ఆమె ప్రవేశించగానే ప్రతిపక్షంలో అలాబలం మొదలయ్యింది.
 As she entered the house there was an uproar in the Opposition.

   మెదడుకు మేత / Food for thought

కనుగొనగదోయి భావలోచనము దెఱచి మామకీన ప్రచండ తేజోమహత్త్వ
మీ విషానలకీలా ప్రభావ దగ్దమై సమస్తము నడగు సృష్ట్యాది నుండి!
ఈ మదీయ కరాళ జిహ్వికలయందు జీవసముదయమెపుడైన జిక్కవలయు
ఈ విషానల ధూమరేఖావృతమయి కుందు జీవాళికదియె వైకుంఠపథము

--మృత్యువుకీ జీవజాలానికీ అనుబంధం, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి