సింగిడి

 

సెప్టెంబర్ 28, 2022

సింగిడి (singidi)

    అర్థము

   (విశేష్యము): ఇంద్ర ధనస్సు; హరివిల్లు

   Meaning

   (noun) : rainbow

   వాడుక / Usage

 పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా గ్రేటర్‌ అంతా తీరొక్క పువ్వులతో మురిసిపోతున్నది.
 Greater Hyderabad glowed with flowers that looked as if rainbow of flowers descended from the heavens.

   మెదడుకు మేత / Food for thought

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే

(నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ?)

--మహాభాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి