తొత్తు

 

సెప్టెంబర్ 30, 2022

తొత్తు (tottu)

    అర్థము

   (విశేష్యము): దాసి; బానిస; తైనాతీ; వేశ్య

   Meaning

   (noun) : slave/servant girl; prostitute; concubine

   వాడుక / Usage

 బ్రిటీష్‌కు నువ్వు తొత్తువు; తొత్తు కింద తొత్తులుగా మేము బతకదల్చుకోలేదు అని కాళోజి నిజాంను ఎదిరించారు.
 Kaloji opposed Nizam, refusing to be a slave under a slave of the British.

   మెదడుకు మేత / Food for thought

రాట్నం వడుకుతూ, ఆ ఝంకారమే తంబూరా శ్రుతిగా తనకు తెలిసిన పాట పాడుతున్నది ఒక పండు ముత్తయిదువు.

‘‘ఉసికాల ఆడేటీ
కుసుమా సిరిబాలా
మా బాలా వచ్చిందా
మిమ్ము కూడంగ’’

ముంగిట్లో నుంచుని వింటున్న నేను ముగ్ధుణ్నయిపోయాను. తీగసాగినట్టున్న ఆ రాగానికే కాదు, అమాయక హృదయం నుంచి పొంగి వచ్చిన ఆ ఆత్మీయతకు, ఆ నిసర్గ రసవద్గీతకు. ఒక తల్లి ఒక పాప నడుగుతున్నది తన పాప గూర్చి. ఆ పాప యెవరు? ‘ఉసికాల ఆడేటి కుసుమా సిరిబాల’ – ఇసుక ఉసికగా మిసిమి పెంచుకుంది. మరి ‘కుసుమా సిరిబాలా!’ ఇది వ్యాకరణం దృష్టిలో వైరిసమాసం. కానీ ఎంత వింత పదమైత్రి. అటు కుసుమం – ఇటు బాల. మధ్యలో సిరి. కుసుమా సిరిబాల – కుసుమంలా సిరులొలికే బాల – రెండు తత్సమాల నడుమ ఇమిడిపోయిన ఆ దేశిసిరి ఏమంటుంది? అమాయకులైన జానపదులు ప్రయోగించే సిరిసమాసాలైనా కలకండ పలుకుల్లా రుచులొలుకుతాయని, అసమర్థులైన కవులు పనికట్టుకుని సృష్టించే మిశ్రమ సమాసాలు పెరుగూ వడ్లూ పిసికినట్లు రసాభాసపాలౌతాయని.

-- డా. సి. నారాయణ రెడ్డి (జులై  29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి