అనువర్తనము
సెప్టెంబర్ 06, 2022
అనువర్తనము (anuvartanamu)
అర్థము
(విశేష్యము): అనుసరించుట; వెంట నడవడం; అన్వయించు
Meaning
(noun) : applied; following; complying
వాడుక / Usage
అనువర్తిత నిర్వహణ మీద పీటర్ డ్రకర్ అనేక పుస్తకాలు ప్రచురించాడు.
Peter Drucker published many books on Applied Management.మెదడుకు మేత / Food for thought
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసె ఘనత రాముడు చూపగా
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసె ఘనత రాముడు చూపగా
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే.. మత్సరమ్ములు రేపగా
మదమత్సరమ్ములు రేపగా...
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని... పుణ్యచరితము పాడగా..
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసె ఘనత రాముడు చూపగా
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసె ఘనత రాముడు చూపగా
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే.. మత్సరమ్ములు రేపగా
మదమత్సరమ్ములు రేపగా...
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని... పుణ్యచరితము పాడగా..
-- గోరంత దీపం, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment