ప్రామాణీకరణ

 

సెప్టెంబర్ 07, 2022

ప్రామాణీకరణ (prāmāṇikarana)

    అర్థము

   (విశేష్యము): ప్రామాణికము=యథార్థమైన, సత్యమైన; యథార్థము అవునో కాదో తెలుసుకునే ప్రక్రియ

   Meaning

   (noun) : authentication

   వాడుక / Usage

 పటిష్టమైన ప్రామాణీకరణ లేనిదే ప్రభుత్వం అంతర్జాలం ద్వారా సేవలు అందించలేదు.
 Strong authentication is a prerequisite for delivering services over internet.

   మెదడుకు మేత / Food for thought

ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...
అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అణ్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..
బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్ల బడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలీ పోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

-- బడ్జెట్ పద్మనాభం, చంద్ర బోస్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి