లొటారము

 

అక్టోబర్ 03, 2022

లొటారము (loṭāramu)

    అర్థము

   (విశేష్యము): బొక్క; శూన్యత; రంధ్రము; బీదరికం; నిస్సారము

   Meaning

   (noun) : hole; pit; empty; worthless; poverty

   వాడుక / Usage

 ప్రైవేట్ బడులలో విద్యాబోధన పైన పటారం లోన లొటారం చందంగా ఉంది.
 The education in private schools is all style and no substance.

   మెదడుకు మేత / Food for thought
మధుర: చట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ తెల్ల వెంట్రుక తగిల్తేనే చమక్‌.
రామ: స్వారస్యం మా చమత్కారంగా తీశావ్‌ ! యేదీ ముద్దు.
మధుర: సత్తువుందనా మోటతనం?
రామ: చాప చిరిగినా చదరంతని, నీప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కన పడుతూంది...
రామ: లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడవేఁ కదూ?
మధుర: యేమ్మోసం!
రామ: లౌక్యం, లౌక్యవఁను!
మధుర: రెండింటికీ యేవిఁటో భేదం.
రామ: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవఁను.
మధుర: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థవేఁవిటి?
రామ: యావఁన్నావూ? అబద్ధవఁనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అదివకవృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాఁడి ద్రవ్యా కర్షణ చేసేది. యీ ధర్మ సూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి.


-- కన్యాశుల్కం, గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862 - 1915)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి