యాదృచ్ఛికము

 

అక్టోబర్ 10, 2022

యాదృచ్ఛికము (yādṛcchikamu)

    అర్థము

   (విశేషణము): కాకతాళీయము; తనంతట తాను అయ్యేది; ఎదురు చుడనిది

   Meaning

   (adjective) : unexpected; spontaneous; accidental; coincidental

   వాడుక / Usage

 ఇంగ్లండ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన జులన్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే కెరీర్‌ను
 ముగించడం యాదృచ్ఛికం.
 It's coincidental that Julan started and ended her international career against England.

   మెదడుకు మేత / Food for thought

కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్‌

వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా


(కావ్యపఠన,శాస్త్రావగాహనముల వలన కలిగిన ఆనందంతో, బుద్ధిమంతులైన వారి యొక్క సమయము గడుస్తుంది. ఇక మూర్ఖులయొక్క కాలము, దుర్వ్యసనముల చేత, అకాలనిద్ర చేత, మరియు కల్పిత వివాదముల చేత గడుస్తుంది. అనగా ఉత్తముల కాలము సద్విషయాలతో, అధముల సమయము దుర్విషయాచరణతో గడుస్తూ ఉంటుంది)

-- హితోపదేశ, నారాయణ పండితుడు (~ తొమ్మిదవ శతాబ్ధము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి