ఒడలు

 

అక్టోబర్ 13, 2022

ఒడలు (oḍalu)

    అర్థము

   (విశేష్యము): శరీరము; దేహము; మేను; ఆధారం; నెలవు; భూమి

   Meaning

   (noun) : body; abode; earth

   వాడుక / Usage

 విదురుడు భక్తిపారవశ్యంతో ఒడలు మరచి పండు పారవేసి అరటిపండు తొక్కనే కృష్ణునికి తినిపించాడు.
 Vidura lost himself in devotion and fed Krishna the peel of the banana.

   మెదడుకు మేత / Food for thought

పలుదోమి సేయు విడియము

తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్

పొలయలుక నాఁటి కూటమి,

వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

(దంతములు తోముకొనినవెంటవే వేసుకొను తాంబూలము, తలంటుకొని స్నానముచేసిననాటి నిద్ర, స్త్రీలతో ప్రణయకలహములు ఆడిన నాడు జరిగే పొందు - వీటి విలువ ఇంతయని చెప్పలేము సుమా)


-- బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి