లోలత్వము

 

అక్టోబర్ 14, 2022

లోలత్వము (lolatvamu)

    అర్థము

   (విశేష్యము): చాపల్యము; చంచలత్వము; ఆశ; తృష్ణ

   Meaning

   (noun) : fickleness; desire

   వాడుక / Usage

 చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చాలని గీత బోధిస్తోంది.
 Geeta teaches that the fickle mind be restrained by reining the Senses.

   మెదడుకు మేత / Food for thought

బంగారు కుదువఁబెట్టకు

నంగడి వెచ్చము లాడకు,

సంగరమునఁ బాఱిపోకు, సరసుడవైతే

వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ!

(బంగారము తాకట్టుపెట్టకు. యుద్ధమునందు పారిపోకు. దుకాణము నందు వెచ్చాలు అప్పు చేయకు. అవివేకితో స్నేహము చేయకు)


-- బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి