గరిమ

 

అక్టోబర్ 20, 2022

గరిమ (garima)

    అర్థము

   (విశేష్యము): గొప్పతనం; గౌరవం; మహత్యం; బరువు; విధము

   Meaning

   (noun) : greatness; gravitas; weight; heaviness; worth; excellence

   వాడుక / Usage

శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె గరిమలఁ గపటాలఁ గలకాలము.
Knot the hair, untangle the knots; weighty mighty deceptions galore all our time.

   మెదడుకు మేత / Food for thought

గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాము.
నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము.
భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు.
అమ్మా నాన్న దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే మనం అసలు లేము.
చదువు నేర్పిన గురువు దేవుడు.
కష్టంలో నష్టంలో దుఃఖంలో సుఖంలో దగ్గరుండే స్నేహితుడు; అంటే నువ్వే నాకు దేవుడివి.
నీకు మొక్కుతున్నారా...అంతేకానీ ఆ నల్ల రాళ్లకు రప్పలకు కాదు!

-- మూలం తెలియదు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి