చైతన్య స్రవంతి
అక్టోబర్ 25, 2022
చైతన్య స్రవంతి (chaitanya sravanti)
అర్థము
(విశేష్యము): చైతన్య=తెలివి/ప్రాణము, స్రవంతి=నది/యేరు; మనిషి మన: ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన, విరుద్ధమైన భావాలను సాధ్య మైనంత యథార్థ రూపంగా అక్షరరూపం ఇవ్వడం
Meaning
(noun) : stream of consciousness - method that attempts "to depict the multitudinous thoughts and feelings which pass through the mind" of a narrator
వాడుక / Usage
బుచ్చిబాబు నవల 'చివరకు మిగిలేది' చైతన్య స్రవంతి శిల్పానికి మార్గదర్శకమైనది.Bucchibabu's novel 'Chivaraku Migiledi' paved the narrative technique of Stream of Consciousness.
మెదడుకు మేత / Food for thought
పరిమళించు వెన్నెల నీవేపలకరించు మల్లిక నీవే
నా జీవన బృందావనిలో
నడయాడే రాధిక నీవే
కనుల ముందు నీవుంటేకవిత పోంగి పారదా
తొలి చిగురుల చూడగానే ....కల కోకిల కూయదా
అలనాటి జనకుని కోలువులో... తోలి సిగ్గుల మేలి ముసుగులో...
అలనాటి జనకుని కోలువులో... తోలి సిగ్గుల మేలి ముసుగులో...
ఆ..ఆ..రాముని చూసిన జానకివై
అభిరాముని వలపుల కానుకవై
వాల్మీకి కావ్య వాకిట వెలసిన.. వసంత మూర్తివి నీవే....
అలనాటి సుందరవనములో... వనములో
ఎల ప్రాయం పోంగిన క్షణములో
అలనాటి సుందరవనములో.. ఎల ప్రాయం పోంగిన క్షణములో
ఆ..ఆ..రాజును కనిన శకుంతలవై
రతిరాజు భ్రమించిన చంచలవై
కాళిదాసు కల్పనలో మెరిసిన.. కమనీయ మూర్తివీవే
అజంతా చిత్ర సుందరివై... ఎల్లోరా శిల్ప మంజరివై
అజంతా చిత్ర సుందరివై... ఎల్లోరా శిల్ప మంజరివై
రామప్ప గుడి మోమున విరిసిన.. రాగిణివై.. నాగినివై
అమరశిల్పులకు ఊపిరిలూదిన అమృతమూర్తివి నీవే
-- చెల్లెలి కాపురం, సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment