సుప్తి

 

అక్టోబర్ 26, 2022

సుప్తి (supti)

    అర్థము

   (విశేష్యము): నిద్ర; తిమ్మిరి; సుషుప్తి; మేల్కొన్న తరువాత కలలు సైతం జ్ఞాపకం రాని గాఢనిద్ర

   Meaning

   (noun) : sleep; deep sleep; unconscious

   వాడుక / Usage

ఫ్రాయిడ్ ప్రకారం మనస్సుకు సుప్తచేతన, ఉపచేతన, చేతన అను మూడు దశలు ఉంటాయి.
Freud's psyche has three states - unconscious, sub conscious and conscious.

   మెదడుకు మేత / Food for thought

మౌనమెందుకు.. మాటాడవెందుకు
దూరమెందుకు.. దరి చేరవెందుకు
ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు

అంత బిగువా.. మెట్టు దిగవా.. ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా... మాట వినవా.... కొంత కష్టం అయినా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు

రెచ్చగొట్టినా.. నవ్వుతున్నదే.. మత్తు కమ్మేసిందా కన్నె మనసుని
ఎంత కుట్టినా.. కెవ్వుమనదే.. పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటే ప్రాణం ఇక నిలవనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు

-- క్లాస్మేట్స్ , సిరివెన్నెల సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి