వాసన
అక్టోబర్ 27, 2022
వాసన (vaasana)
అర్థము
(విశేష్యము): గంధము; వస్త్రము; సంస్కారము; దురాశ; అనుభూతార్థస్మృతి (అనుభూతి కారణంగా చేతనంలో ముద్రపడినవి)
Meaning
(noun) : fragrance(or stink); subconscious impressions which are stored up as a result of past actions
వాడుక / Usage
అభినవగుప్తుడి ప్రకారం బాహిర జగత్తు అదివరకే మనిషిలో ఉన్న వాసనలకు తదనుగుణమైన వాటిని గుర్తు చేస్తుందే తప్ప ప్రత్యేకంగా కొత్త జ్ఞానాన్ని కల్పించదు.Abhinavagupta postulated that the external world only brings forth knowledge derived from memory. It does not create new knowledge.
మెదడుకు మేత / Food for thought
ఏమని పాడెదనో ఈ వేళా
ఏమని పాడెదనో ఈ వేళా
మానస వీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో...
జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించీ
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళా
యేమని పాడెదనో...
వనసీమలలో హాయిగా ఆడే
రాచిలుక నిను రాణిని చేసే
పసిడి తీగలా పంజరమిదిగో
పలుకవేమనీ పిలిచేవేళా
--భార్యాభర్తలు (1961), శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment