అక్టోబర్ 31, 2022
సింహావలోకనము (simh-āva-lōkanamu)
అర్థము
(విశేష్యము): సింహ+అవలోకనము(చూడడం); (సింహంలాగా) అంతా కలియచూడడం; పర్యవేక్షణ; గతంలో జరిగిన తప్పులను విశ్లేషించడం
Meaning
(noun) : Lion's look; careful inspection; retrospection
వాడుక / Usage
కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి సింహావలోకనం చేయకపోతే తప్పులు దిద్దుకునేది ఎలా?
How can lessons be learnt if there is no retrospection of the failures of Government during Corona? మెదడుకు మేత / Food for thought
అయిదు నెలలు పైగా భారత లోక్ పాల్ చైర్మన్ పదవి భర్తీ అవలేదు. కేవలం తాత్కాలిక చైర్మన్ ఉన్నారు. కమిటీలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు కాగా వాటిలో రెండు స్థానాలు రెండు సంవత్సరాల పైగా భర్తీ చేయబడలేదు.
లోక్ పాల్ వెబ్ సైట్ ప్రకారం 2020-2021 వార్షిక నివేదిక మార్చ్ 31, 2021 రాష్ట్రపతికి సమర్పించారు. కానీ 2021-2022 నివేదిక ఇప్పటి వరకు సమర్పించిన దాఖలాలు లేవు. సమాచార హక్కు చట్టం క్రింద ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఇది ఇచ్చారు - లోక్ పాల్ కి 2021-2022 కాలంలో 5,680 ఫిర్యాదులు అందగా అందులో 5,100 ఇంకా నమోదు చేసుకోలేదు.
Comments
Post a Comment