ఉడ్డోలం

 

అక్టోబర్ 04, 2022

ఉడ్డోలం (uddolam)

    అర్థము

   (విశేష్యము): సాటిలేని; పెద్దది; అత్యధికం; ఉప్పొంగే; ఆశ్చర్యం

   Meaning

   (noun) : huge; incomparable; surprise

   వాడుక / Usage

 ఉత్తరగోగ్రహణంలో కౌరవుల ఉడ్డోలమైన సైన్యాన్ని అర్జునుడు ఒక్కడే ఓడించాడు.
 Arjuna single-handedly defeated Kourava's mighty army.

   మెదడుకు మేత / Food for thought
చలం: ఏమిట్రా కేకలు?
గీత : నాన్నా, అన్నయ్య ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాడు.
సత్యం: ఎవరో అమ్మాయి కాదు. నా అదృష్టవశాత్తు నన్ను ప్రేమించిన ఓ లక్షాధికారిణి. నేను చాలా అందంగా కనిపించానట ఆవిడకి. డ్రైవ్ చేయగలవా అని అడిగింది. నేర్చుకుంటాను అన్నాను. నెల రోజులు నేర్పింది. బూట్లు పాలిష్ చేయగలవా అంది. కొనిస్తే చేసుకుంటాను అన్నాను. ఇవి ఆవిడే కొంది. నా భర్తగా ఉండగలవా కొంతకాలం అంది. ప్రయత్నిస్తాను అన్నాను. అంతే. నన్ను లేవదీసుకుపోడానికే నిశ్చయించింది. ఆధునిక రుక్మిణీ కళ్యాణం. హౌ డు యూ లైక్ ఇట్?
చలం: ఛీ నోర్ముయ్
సత్యం: అంత గౌరవం నాకెందుకు నాన్నా! నేనేం పదిమంది పిల్లల్ని కని దేశంమీద పడి బ్రతకండ్రా అని వదిలేసానా? పెద్ద కొడుక్కి గుమస్తా చిన్న వాడికి బంట్రోతు చదువు చదివించగలిగానా? ఇరవై ఏళ్ల కూతురికి పెళ్లి చేయడం చేత కాక గుండెల మీద కుంపటి చేసుకున్నానా? వద్దు నాన్నా! ఆ అర్హత నాకు లేదు. మరెవరి చేతనైనా మూయించుకోండి మీ నోరు.


--ఒక చెట్టు - రెండే పూలు (1968), గొల్లపూడి మారుతీరావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి