అక్టోబర్ 05, 2022
మేజువాణి (mejuvani)
అర్థము
(విశేష్యము): విందు; వేడుక; భోగంవారి మేళము
Meaning
(noun) : feast; celebration; dancing girl's dance/music
వాడుక / Usage
తెలుగు తొలి సైన్స్ ఫిక్షన్ కథ ‘పరమాణువులో మేజువాణి’ హైదరాబాదుకు చెందిన సిరిగూరి జయరావు 1927 డిసెంబరు ‘సుజాత’ పత్రికలో రాశారు.
The first science fiction story in Telugu 'dance in atom" by Siriguri Jayarao was published in 1927 in the magazine Sujata.
మెదడుకు మేత / Food for thought
గురువు: ఎవరు నాయన నువ్వు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు?
వేమన: జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుణ్ణి
గు: జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా?
వే: లేదా స్వామి? వేద వేదాంగాలెరిగిన మహర్షులు, దేశ దేశాల్ని జయించిన చక్రవర్తులు, సీదా సాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే! వీరంతా మరణించిన తరువాత ఏమవుతున్నారు స్వామి?
గు: పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే మరణించిన తరువాత ఏమవుతారని విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను. అనుభవించు.
వే: వద్దు స్వామి. అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే. మనం ఎక్కడ నుంచి పుడుతున్నాం? ఎక్కడికి పోతున్నాం? ఈ సందేహం నివారించండి.
-- యోగి వేమన (1947) గా చిత్తూరి నాగయ్య (మార్చ్ 28, 1904 - 1973)
Comments
Post a Comment