దిడ్డీ

 

అక్టోబర్ 06, 2022

దిడ్డీ (dhiddi)

    అర్థము

   (విశేష్యము): దొడ్డి; పెరడు; చిన్న కిటికీ లేక గూడు

   Meaning

   (noun) : backyard

   వాడుక / Usage

 గోధూళి వేళ దిడ్డీలో నుంచుని ఆమె కర్రి ఆవు కోసం ఎదురు చూసింది.
 At sunset she stood in the backyard waiting for the black cow.

   మెదడుకు మేత / Food for thought
గు: ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకు సాధ్యం అవుతుందా?
వే: మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కు ఎవరు స్వామీ? నేనీ దుఃఖ భాజనమైన సంసారంలో  కృశించి జననమరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసిందేనా?మానవునికి తరుణోపాయం లేదా స్వామీ!
గు: లేకేం నాయనా! ఉంది. ఈ శరీరం విద్యావిద్యలు రెంటితోను పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకుని దుఃఖ భజనములమై చావు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుతున్నాము. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యము అని తెలుసుకుని ఆ ఆత్మానుభవము పొందాలి! అదే జీవిత పరమార్థం. 
వే: ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామీ?
గు: భక్తి మార్గంతో కొందరూ, జ్ఞానమార్గంతో కొందరూ సాధించారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దలమతం.
-- యోగి వేమన (1947)దర్శకత్వం కే వి రెడ్డి (జులై 01, 1912 - 1972)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి