యాతం

  

అక్టోబర్ 07, 2022

యాతం (yaatamu)

    అర్థము

   (విశేష్యము): నీళ్లు తోడే ఏటవాలు కొయ్యబద్ద యంత్రము; ఏతము; రాటనము

   Meaning

   (noun) : water lift built using a seesaw mechanism; well pole

   వాడుక / Usage

 ఎండబడి వచ్చిన రైతుకు అతని బిడ్డడు యాతం తోడి దప్పిక తీర్చాడు.
 The farmer returned weather beaten and his son drew water to quench his thirst.

   మెదడుకు మేత / Food for thought

వే: రాజయోగమా?! నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ?
గు: ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై ఉపదేశిస్తాడు.
వే: కారు చీకటిలో దారితెలియక తికమకపడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు. నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి.
గు: అతిగుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై విను. రసాన్ని కట్టేస్తే కానీ స్వర్ణం కానట్లు మనస్సుని కట్టివేస్తేగాని సత్యం కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. దానిని స్వాధీనం చేసుకుంటే మనకు స్వాధీనం కానిది లేదు. ఆ సాధనే యోగమంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తలను అణచి సమాధి స్థిరుడవైనపుడు నీ మనస్సుకు అనంత శక్తీ కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింత వరకు తన చేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది.
వే: మోక్షమంటే అదేనా స్వామీ?
గు: కాదు నాయనా, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తీ ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడివై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చిదానందమయము శాశ్వతము అయిన స్వస్వరూపానుభవము కేవల జ్ఞాన రూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అదే! అప్పుడు నువ్వు నేను ఒక్కటే..

-- యోగి వేమన (1947) సంభాషణ  సముద్రాల రాఘవాచార్య (జులై 19, 1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి