కొంగజపము

 

నవంబర్ 01, 2022

కొంగజపము (kongajapamu)

    అర్థము

   (విశేష్యము): పైకి మంచిగా కనిపిస్తూ లోపల దుర్బుద్ధి ఉండడం; కొంగ ఒంటికాలి మీద జపం చేస్తున్నట్లు నుంచుని చేపలను మాయచేసినట్లుగా!

   Meaning

   (noun) : wolf in a sheep's skin

   వాడుక / Usage

నాయకుల కొంగజపాన్ని అర్ధం చేసుకోలేని ప్రజలున్నంతవరకు కట్టడాలు కూలుతూనే ఉంటాయి.
As long as people don't realise the duplicity of leaders, accidents will keep recurring.

   మెదడుకు మేత / Food for thought

చరణాలు చరణాలు ముక్తి సోపానాలు
శరణన్న వారికవి మోక్షభవనాలు
ధరణిసిరి హృదయాల తనరారు చరణాలు
గిరిజేశ్వరాకృతిని కీర్తించు చరణాలు
గిరిచూపు గలవాని నిరసించు చరణాలు
సరయూ నదీ తటిని విహరించుచరణాలు
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన కిరణాలు
సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు
శాంతి కవి నిలయాలు సౌందర్యవలయాలు
సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు
-- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి