రజ్జుసర్ప

 

నవంబర్ 18, 2022

రజ్జుసర్ప (rajjusarpa)

    అర్థము

   (న్యాయం): రజ్జు=త్రాడు; త్రాడు చూసి పాము అనుకున్నట్లు

   Meaning

   (logic) : (mis)taking rope for a snake and fearing

   వాడుక / Usage

మనం రజ్జుసర్ప భ్రాంతి అన్న భావాన్నే భౌతిక శాస్త్రంలో “ష్రోడింగర్ పిల్లి” అంటారుతలుపు తెరచి చూడు: పిల్లి బతికి ఉందొ చచ్చిపోయిందో తేలుతుంది. దీపం వేసి చూడు: కాలికి తగిలినది తాడో, పామో తేలిపోతుంది.
Serpent and rope logic is akin to Schrodinger's cat in Physics. As long as you don't open the door the cat is still alive. Unless you shine the light you don't know if its a rope or snake.
 

   మెదడుకు మేత / Food for thought

 
స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరినుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం....మొత్తం సమాజాన్ని మార్చను నాకు చేతకాదని ౼ నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చేయకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ?నా బతుకు నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం వుండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నా పని. నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికి వల్ల సమాజానికేదో చలనం వుండాలి.

-- స్వేచ్ఛ, (పోపూరి లలిత) ఓల్గా

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి