కాకిలెక్కలు

 

నవంబర్ 02, 2022

కాకిలెక్కలు (kaaki-lekkalu)

    అర్థము

   (విశేష్యము): అబద్ధపు లెక్కలు; కాకి=అల్పము, తక్కువ రకం

   Meaning

   (noun) : doctored/false accounts

   వాడుక / Usage

కల్లి బొల్లి కబుర్లు, కాకిలెక్కలు చెప్తే వాటిని విశ్లేషించి ప్రశ్నించే పౌరులు లేకపోతే ప్రజాస్వామ్యానికి దిక్కులేని చావు తప్పదు.
If there is no informed citizenry to analyse and question duplicitous narratives and accounts, democracy is bound to perish.

   మెదడుకు మేత / Food for thought

ఉభయమధ్యావస్థయందే మనుజజాతికి సర్వ ప్రపంచమునకు సౌఖ్యమున్నది. అందు చేత సుఖము, బాధ యనునవి ప్రకృతిస్థితులుగాని స్వతంత్రత్త్వములు గావు. ఒక్క ప్రకృతినన్ని భోవోమువంకబోయి కష్టమైనది. అమితత్వమువంకఁ బోయి కష్టమైనది. అందుచేత సుఖము, బాధ యనునవి వస్తుతత్త్వమున నొక్కటే యని స్పష్టపడుటలేదా? బుద్ధభగవానుఁ డేమి సెలవిచ్చినాఁడు?

ఉభయదిశల గష్ట ముండు సౌఖ్యమునకు
నదియె నడుమ జేరి యగును సుఖము
బాధ సుఖము నొకటి వస్తుత్త్వమునను
గతినిబట్టి భేదకలన కలిగె.

ఉభయమధ్య సుఖావస్థనే The golden mean అని పాశ్చాత్యులభినందించినారు. ప్రకృతి సత్యము సృష్టిసంబధమైన Economy తో సంబంధించి యుండవచ్చును. తక్కువ వస్తుసామగ్రితో నెక్కువజన మెక్కువసౌఖ్య మొందుటకంటె కావలసినదేమి?

-- సాక్షి, పానుగంటి లక్ష్మీ నరసింహ శాస్త్రి (నవంబర్ 2, 1865 - 1940)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి