ఆంగికము

నవంబర్ 28, 2022

ఆంగికము (āngikamu)

    అర్థము

   (విశేషణము): అంగముతో చేయబడినది; హస్తములతో చేయు అభినయము; కనుబొమలు ఎగురవేయుట; స్త్రీల హావభావము

   Meaning

   (adj/adv) : bodily actions; gesticulations with hands or raising eyebrows used in classical dance

   వాడుక / Usage

వెంపటి చినసత్యం నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలు అత్యధ్బుతంగా ఉంటాయి.
Vempati Chinasatyam's dance incorporates beautiful actions, gesticulations and expressions. 
 
   మెదడుకు మేత / Food for thought

పిలిచిన మురళికి,వలచిన మువ్వకి, ఎదలో ఒకటే రాగం..
అది ఆనంద భైరవి రాగం!!

మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి, ఎదలో ప్రేమ పరాగం..
మది ఆనంద భైరవి రాగం!!

కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దుర లేచే..
కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దుర లేచే..
మనసే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచే..
యమునా నదిలా పొంగినది
స్వరమే వరమై..సంగమమై!!

మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి, ఎదలో ప్రేమ పరాగం..
మది ఆనంద భైరవి రాగం!!

పిలిచిన మురళికి,వలచిన మువ్వకి, ఎదలో ఒకటే రాగం..
అది ఆనంద భైరవి రాగం!!

ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మోగే..
పదమే పదమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే..
హృదయం లయమై పోయినది..
లయలే ప్రియమై..జీవితమై!!

మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి, ఎదలో ప్రేమ పరాగం..
మది ఆనంద భైరవి రాగం!!

పిలిచిన మురళికి,వలచిన మువ్వకి, ఎదలో ఒకటే రాగం..
అది ఆనంద భైరవి రాగం!!

--ఆనందభైరవి, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి