కప్పదాటు

 

నవంబర్ 04, 2022

కప్పదాటు (kappa-ḍaatu)

    అర్థము

   (విశేష్యము): చేసిన నేరం చేయలేదని నమ్మించటానికి చెప్పే తప్పుడు కారణాలు; పని మధ్యలో వదిలి వేరొక పని మొదలుపెట్టడం; కప్ప దూకుతూనే పక్కకు తప్పుకునేట్లుగా

   Meaning

   (noun) : sidestep; give excuses to cover up; skip over tasks 

   వాడుక / Usage

యంత్రాంగ లోపాల్ని కప్పిపుచ్చుకునే కప్పదాటు వైఖరిని నిగ్గతీసి అడగాల్సిన విధాన సభలు బూతులు తిట్టుకోవడానికే పరిమితం అయ్యాయి.
Legislatures, whose role is to prevent Executive sidestepping responsibility, have been reduced to name calling. 

   మెదడుకు మేత / Food for thought

 త్యాగానికి ఒక పరిమితి ఉంది అనే వాదం వెంకయ్య విషయంలో ఓడిపోయిందనే చెప్పాలి. అన్ని విధాలా తగిన ఇల్లాలు రుద్రమ్మ. బహుశా వాల్మీకి గానం చేసిన సీతమ్మ త్యాగం కూడా ఈమెతో సరితూగకపోవచ్చు. ఆమె రాణిగనుక వనవాసం చేసిన ఘట్టాన్ని తలచుకుని జాలిపడింది మానవ హృదయం. పైగా ఆమె ఎక్కడా కూలి చేయలేదుగా! రుద్రమ్మ అలా కాదు. మగనితో పాటు వృద్ధాప్యంలో కాలే ఎండలలో గులకలు మోయడం అలవర్చుకుంది. జానెడు పొట్టకోసం ఇంత కష్టపడక్కర్లేదు. ఉన్న కుమార్తెలు పోషించగలరు. కానీ ఒక విధంగా వారికి చెందవలసిన ఆస్తిని దానం చేసి, బడి కట్టించి, పైగా వారికి భారంగా కూచోరాదని ఆమె నిర్ణయం. వెంకయ్య ఆలోచన కూడా అంతే.

--పిచ్చి దంపతులు, కె సభా (జులై 01, 1923 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి