తప్తము
నవంబర్ 29, 2022
తప్తము (taptamu)
అర్థము
(విశేషణము): తపింప చేయబడినది; వేడి/కాచ బడిన; అగ్నిచే పునీతం చేయబడిన
Meaning
(adj/adv) : heated; burnt; purified by fire; penance; distressed; afflicted
వాడుక / Usage
బాధాతప్త హృదయం భగ్న ప్రేమికులకు విధి విధించిన శిక్ష.
Pain in the jilted lovers hearts is a curse of fate.
మెదడుకు మేత / Food for thought
ఎవరో జ్వాలను రగిలించారు !
వేరెవరో దానికి బలియైనారువేరెవరో దానికి బలియైనారు ||ఎవరో||అడుగు అడుగునా అపజయములతోఅలసి సొలసిన నా హృదయానికిసుధ వై జీవన సుధవైఉపశాంతి నివ్వగా ఓర్వని వారలు ||ఎవరో||అనురాగానికి ప్రతి రూపాలైఆది దంపతుల వలె మీరుంటెఆనందముతో మురిశానేఆత్మీయులుగా తలచా నేఅందుకు ఫలితం అపనిన్దెనా ||ఎవరో||మనిషి మనిషికి మమత కూడదా ?మనసు తెలుసుకొను మమతే లేదా ?ఇది తీరని శాపం ! ఇది మారని లోకంమానవుడే దానవుడై మస లే చీకటి నరకం ||ఎవరో||
ఎవరో జ్వాలను రగిలించారు !
వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు ||ఎవరో||
అడుగు అడుగునా అపజయములతో
అలసి సొలసిన నా హృదయానికి
సుధ వై జీవన సుధవై
ఉపశాంతి నివ్వగా ఓర్వని వారలు ||ఎవరో||
అనురాగానికి ప్రతి రూపాలై
ఆది దంపతుల వలె మీరుంటె
ఆనందముతో మురిశానే
ఆత్మీయులుగా తలచా నే
అందుకు ఫలితం అపనిన్దెనా ||ఎవరో||
మనిషి మనిషికి మమత కూడదా ?
మనసు తెలుసుకొను మమతే లేదా ?
ఇది తీరని శాపం ! ఇది మారని లోకం
మానవుడే దానవుడై మస లే చీకటి నరకం ||ఎవరో||
--డా.చక్రవర్తి, ఆత్రేయ (మే 07, 1921 - 1989)
Comments
Post a Comment