నెరులు

 

డిసెంబర్ 13, 2022

నెరులు (nerulu)

    అర్థము

   (విశేష్యము): తల వెంట్రుకలు; కురులు

   Meaning

   (noun) : hair; tresses

   వాడుక / Usage

"నిగనిగని మోముపై నెరులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను"
"Strands of hair scattered on all sides of her glowing face, the dear girl slept till late in the morning"

   మెదడుకు మేత / Food for thought

కామాన్ని ప్రేమ గానో, దానితో పాటు వచ్చే అసూయ గానో, త్యాగం గానో, మరో ఆదర్శవంతమైన ఆవేశంగానో మారనిచ్చావో జీవితంలో సుఖం ఉండదు. సుఖం దానంతట అది రాదు. సుఖం నువ్వు చేసుకునేది. అది అదృష్టం వల్లో, మరో సదుపాయం వల్లో వచ్చే వొస్తువు కాదు. ఆలోచనల వల్ల, లౌక్యం వల్ల, చాకచక్యం వల్ల మాత్రమే సౌఖ్యం సాధ్యం. నీతి, స్నేహం, న్యాయం, ధర్మం ఇవి నిజాలు కావు. కాని ఇవి ఉన్నాయని తెలివితక్కువ వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాటికి అస్తిత్వం ఉంది. వాళ్ళు నమ్ముతారు కాబట్టి, వాళ్ళే లోకంలో ఎక్కువ మంది కాబట్టి, నువ్వు వాటిని నీ సుఖం కోసం వాడుకోవచ్చు. కాని అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మేవో నువ్వూ లోకంలో నానాకష్టాలూ పడే వాళ్ళలో చేరిపోతావు. సంఘానికి సంస్కారం, చట్టుబండలూ అక్కర్లేదు. అది చెయ్యాలనున్నా జరిగే పని కాదు. నువ్వు చెయ్యవలసిన పని అల్లా నీ తెలివితేటలు వాడుకుని అవసరమైనప్పుడు, అవసరమైన పని చేసి అది నీతా, అవినీతా, మంచా, చెడ్డా అనే మీమాంసలు మానేసి సుఖంగా వుండడమే.

-- చాసో (చాగంటి సోమయాజులు) (జనవరి 15, 1915 – 1994)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి