జట్టి

 

డిసెంబర్ 14, 2022

జట్టి (jatti)

    అర్థము

   (విశేష్యము): వెల; అమ్మకం; ఒప్పందం; పరిపూర్ణమైన అజమాయిషీ

   Meaning

   (noun) : price; sale; contract; total ownership

   వాడుక / Usage

"తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేక పతి మనసు జట్టిగొనె గాన"
"Till past dawn, with unending fulfillment, she bought out the heart of the Lord of the world"

   మెదడుకు మేత / Food for thought

ప్రేమ ప్రతిపాదన సుమ గుచ్ఛంతోనో
పెళ్లి కామన పూలమాలతోనో
నా ఎదుట నిలిచిన నిన్ను
నిర్ద్వంద్వంగా తిరస్కరించినపుడు
నిర్దాక్షిణ్యంగా నాపై దాడి చేసి
ఆమ్ల వర్షం కురిపించినపుడు
నా దేహ దేశ సార్వభౌమాధికార హక్కు
నాకు భ్రమగానే మిగిలినపుడు
శత్రు రాజ్యాలను జయించినప్పటికన్నా
వారి స్త్రీల శరీర రాజ్యాలను 
జయించిన సందర్భంలోనే
నీ అహంకారం తృప్తి పడినపుడు
ఎదురుపడిన వ్యక్తిని
వైదొలగమన్న శంకరాచార్యునితో
దేహాన్నా ఆత్మనా అని
సందేహ బాణం సంధించినట్లు
సర్వావయవాల ఈ దేహం
సకలానుభూతులు ఈ శరీరం
నాది కాదా అని / తీరని సందేహం
నిజంగా / ఈ దేహం ఎవరిది

--నీలి గోరింట, మందరపు హైమవతి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి