పవళించు

 

డిసెంబర్ 16, 2022

పవళించు (pavaḷinchu)

    అర్థము

   (క్రియ): పడుకొను; శయనించు; మేను వాల్చు

   Meaning

   (verb) : sleep; recline; lie down

   వాడుక / Usage

"పలుకు దేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది గాన"
"Mother of honeyed speech sleeps, because with maidenly charms, she had united with her Lord"

   మెదడుకు మేత / Food for thought

మట్ట్టి మట్టిని ప్రేమిస్తుంది
మట్టిలో నేను భాగమన్న స్పృహ
నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
చెప్పులు లేకుండా నేల మీద తిరుగుతున్నప్పుడల్లా
కాళ్ళలోంచి పద్యాలు పాకుతాయి.
అంతెందుకు
కొంచెం మట్టిని తెచ్చి కాగితం పై చల్లాను
అవే ఈ అక్షరాలు

చేతులు
వొట్టి తోలు కట్టెలు కావు
అగ్గువగా అమ్ముడౌతున్నంత మాత్ర్రాన
ఎవరికి గులాం గిరి చేయవు

బతుకు తుఫానులో
శరీరం పడవను
తెరచాపల్లా నిలబెడతాయి
తెడ్లై ముందుకు తోస్తాయి

కండ్లలోంచి
నదులు ధారలుగా కారుతుంటే
చేతులు ఆనకట్ట వేస్తాయి
చెయ్యి చెయ్యి కలిపితే
కుటిల మేఘాలు
మెరుపు పగుళ్లతో ముక్కలౌతాయి
-- సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, ఎన్. గోపి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి