చంచరీకము
డిసెంబర్ 19, 2022
చంచరీకము (chancharīkamu)
అర్థము
(విశేష్యము): తుమ్మెద; భృంగము
Meaning
(noun) : carpenter bee
వాడుక / Usage
శకుంతల ముఖపద్మాన్ని ఆశించి ఒక చంచరీకము కలవరపరిచింది.
మెదడుకు మేత / Food for thought
- మలినంబుబాపి నిర్మలతజూపుటజేసి
- యల్ల గంగాదేవి యనగవచ్చు
- నఖిలప్రదేశంబు లందుదోచుటచేసి
- యల పరమాత్మయే యనగవచ్చు
- నిత్యాభిషేకమ్ము నెమ్మిగాంచుటజేసి
- యల జలస్థిత లింగమనవచ్చు
- స్త్రీకర గ్రహణంబు జెలిమినందుటజేసి
- యల పురుషోత్తముడనగవచ్చు
- ననుచునెట్లెట్లో పొగడగా నయ్యెగాదె
- యదియు సింగారపుంగట్ట యనుటజేసి
- కాక నద్దాని జీపురుగట్ట యనిన
- నింతగా వర్ణనముసేయు నెవడుదలచు?
-- అవధానులు కొప్పరపు సోదర కవులు
- మలినంబుబాపి నిర్మలతజూపుటజేసి
- యల్ల గంగాదేవి యనగవచ్చు
- నఖిలప్రదేశంబు లందుదోచుటచేసి
- యల పరమాత్మయే యనగవచ్చు
- నిత్యాభిషేకమ్ము నెమ్మిగాంచుటజేసి
- యల జలస్థిత లింగమనవచ్చు
- స్త్రీకర గ్రహణంబు జెలిమినందుటజేసి
- యల పురుషోత్తముడనగవచ్చు
- ననుచునెట్లెట్లో పొగడగా నయ్యెగాదె
- యదియు సింగారపుంగట్ట యనుటజేసి
- కాక నద్దాని జీపురుగట్ట యనిన
- నింతగా వర్ణనముసేయు నెవడుదలచు?
-- అవధానులు కొప్పరపు సోదర కవులు
Comments
Post a Comment