సినీవాలి
డిసెంబర్ 23, 2022
సినీవాలి (sineewaali)
అర్థము
(విశేష్యము): సినీ=తెలుపు; కొద్దిగా చంద్రుడు కనపడే అమావాస్య; పార్వతి
Meaning
(noun) : a new moon day with faint moonlight
వాడుక / Usage
శీతాకాలపు సినీవాలిలో పొగమంచు మాటున దురాక్రమణ మొదలయ్యింది.
మెదడుకు మేత / Food for thought
ప్ర) పెళ్ళానికీ పక్కింటావిడకీ తేడా ఏవిటండీ ?
స) పెళ్ళం యేం చేసినా బావుండదు. పక్కింటావిడ యేం చేసినా బావుంటుంది.
ప్ర) భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరి పేర్ల చివరా డు ఉంది, ధర్మరాజు కి లేదు..ఎందుకు?
స) ఆయన అరణ్యవాసం లోనూ, అజ్ఞాతవాసంలోనూ, కూర్చుని యింగ్లీషులో ఆజ్ఞలు జారీ చేసేవాడట (అన్నగారు కదా, అందుకని) భీమా..డు, అర్జునా..డు, నకులా..డు, సహదేవా..డు..అంటూ…అందుకే వాళ్ళ పేర్లకి చివర డు వచ్చి చేరింది
ప్ర) ఈ మధ్యన టీ వీ లో అనౌన్సర్లెవరూ వత్తులు పలకట్లేదు ఏంచెయ్యమంటారు
స) లక్ష వత్తుల నోము చేయిస్తే సరి !!
3) తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది, మరి ఆఫీసులో టైపిష్టు ఏంచూస్తుంది ?
స) నువ్వు పని చెయ్యకుండా చూస్తుంది !!
-- అప్రస్తుత ప్రశ్నలకు అవధాని గరికపాటి ఛలోక్తులు
Comments
Post a Comment