సుభగ

 

డిసెంబర్ 29, 2022

సుభగ (su-bhaga)

    అర్థము

   (విశేషణము): సుందరము; భాగ్యవంతము; మనోహరి; భాగ్యవతి

   Meaning

   (noun) : a beautiful, happy or fortunate woman

   వాడుక / Usage

ప్రణయానుభూతులను ఎంకి పాటల్లో నండూరి సుబ్బారావు ఎంతో సుభగ సుందరంగా తీర్చిదిద్దారు.
Nanduri Subbarao depicted romance beautifully in Yenki songs.

   మెదడుకు మేత / Food for thought

గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరస్ అడిగిన ఆనాటి ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. దేవుడు చెడు ఆపాలని ఉన్నా ఆపలేకపోతున్నాడా?అయితే దేవుడు నిర్వీర్యుడు. చెడు ఆపగలడు కానీ ఆపాలని అనుకోవట్లేదా? అయితే దేవుడు కపటి. చెడు ఆపగల్గి, ఆపుదామనే సదుద్దేశం ఉన్నవాడా? అయితే మరి లోకంలో ఇన్ని దురాగతాలు ఏల?

-- స్కాటిష్ జ్ఞానోదయ తత్వవేత్త, డేవిడ్ హ్యూమ్ (ఏప్రిల్ 26, 1711 - 1776 )

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి