అంబకము

 

డిసెంబర్ 06, 2022

అంబకము (ambakamu)

    అర్థము

   (విశేష్యము): కన్ను; నేత్రము; బాణము; 

   Meaning

   (noun) : eye; arrow

   వాడుక / Usage

గోదావరి జన్మస్థానం నాసిక్ లోని త్రయంబకం క్షేత్రం.
Godavari originates in Nasik's Trayambakam (three eyed one) shrine.

   మెదడుకు మేత / Food for thought


సెలయేరా సెలయేరా
గలగలమంటో నిత్యం
ఎలా పాడ గలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు
పాడకుంటే ఎలా?....

నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
డబ్బెందుకు?
కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని
ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత!
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది....

మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.
ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది.....

-- ఇస్మాయిల్ (మే 26, 1928 - 2003)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి