కువలయము
డిసెంబర్ 21, 2022
కువలయము (ku-valayamu)
అర్థము
(విశేష్యము): భూమి; కలువ
Meaning
(noun) : earth; water lily
వాడుక / Usage
రాజు కువలయానందకరుడు అనే వాక్యంలో శ్లేష గుర్తించారా?
మెదడుకు మేత / Food for thought
' సన్న్యాసి 'కీ సన్నాసికీ' తేడా ఏమిటి? (అప్రస్తుత ప్రసంగి)
అవధాని సమాధానం:- సన్న్యాసికీ సన్నాసికీ 'య'వత్తే తేడా అనుకుంటున్నారా? కాదు యావత్తూ తేడాయే,
సన్న్యాసి అంటే లోకాన్ని విడిచి పెట్టినవాడు అని అర్థం. యింక సన్నాసి అంటే లోకం చేత విడువ బడినవాడు అని అర్థం.
విషస్య విషయా ణాం చే దృశ్యతే మహదంతరం
ఉప భుక్తం విషం హంతి విషయః స్మరణా దపి
(విషమునకు ,విషయములకు యెంత యో భేద మున్నది.మనకు 'య' అను అక్షరము మాత్రమె ఎక్కువ అనిపిస్తుంది కానీ విషము తినినచో చంపు చున్నది. విషయ సుఖములు స్మరించిన మాత్రముననే
చంపుచున్నవి.ఒక అక్షరము,లేక ,ఒక వత్తు తేడా తో అర్థమే మారిపోతుంది.)
-- ద్విశతావధానంలో డా. మాడుగుల నాగఫణి శర్మ గారు
-- ద్విశతావధానంలో డా. మాడుగుల నాగఫణి శర్మ గారు
Comments
Post a Comment