ముప్పిరి

 

డిసెంబర్ 09, 2022

ముప్పిరి (mup-piri)

    అర్థము

   (విశేష్యము): మూడు పిరులు; పిరి=మెలి, త్రాడు, దారం; మూడింతలు; అతిశయమవ్వు; పెనవేసుకును

   Meaning

   (noun) : threefold weave; three twists or strands/threads; triple; swell; increase

   వాడుక / Usage

"ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచువారు రామభక్తుఁడైన త్యాగ రాజనుతుని నిజదాసులైన.."
As bhakti swells those that take your name; devotee of Rama Tyagaraja's (salutations to) them the real Gnanis.

   మెదడుకు మేత / Food for thought

మాసిన తలల్ని కుంకుళ్ళతో అంటుకునేముందు
మూసుకున్న తలపులకీ వాటివెనుకనున్న అభ్యంతరాలకీ అభ్యంగనం చేయించామా?
అప్పో సొప్పో చేసి కొత్త బట్టలు కుట్టించుకునే ముందు
చిరుగులుపడ్డ జీవన వాస్తవాలకి కుట్టు వేసుకోగలిగామా?
మన కళ్ళెదుట కదుల్తున్న పగటి వాస్తవాలని
మనవికావులే అని కళ్ళుమూసుకున్నా
అవే వాస్తవాలు రాత్రి పూట పీడకలల్లో
మనముఖాలే తగిలించుకుని ఎదురౌతూ ఉంటే
ఆ కలవరింతల్నుంచి మేలుకోగలుగుతున్నామా?
ఆశయాల్నీ, ఆదర్శాల్నీ ఆశల అంబరం నుంచీ
ఆచరణల ధరాతలం మీదకి దింపలేక
మనమే స్వప్న పక్షాల్ని కట్టుకుని
నీరవ నిశీధంలో విహాయస విహారం చేస్తున్నాం కానీ
నేలమీదా కాలూనే ప్రయత్నమేదైనా చేస్తున్నామా?

-- సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి