విభాజ్యము

 

జనవరి 02, 2023

విభాజ్యము (vibhajyamu)

    అర్థము

   (విశేషణము): విభజింప తగినది; భాగింపబడే సంఖ్య

   Meaning

   (adj/noun) : divisible; dividend

   వాడుక / Usage

అవిభాజ్య విజయనగర సామ్రాజ్య పతనానికి నాంది ‘రక్షసతంగడి’ యుద్ధం (క్రీ.శ.1565).
Battle Of Rakshasatangadi marked the end of undivided Vijayanagara empire.

   మెదడుకు మేత / Food for thought

అంచిత చతుర్థ జాతుడు 
పంచమమార్గమున నేగి ప్రథమ తనూజన్ 
గాంచి, తృతీయం బప్పురి 
నించి ద్వితీయంబు దాటి నృపుకడ కరిగెన్

(పంచ భూతాలు: 1.భూమి 2.నీరు 3.అగ్ని 4.గాలి 5.ఆకాశము)
చతుర్థ జాతుడు: నాల్గవదైన వాయువుకు పుట్టిన ఆంజనేయుడు. 
పంచమమార్గము: అయిదవదైన ఆకాశమార్గాన వెళ్లి 
ప్రథమ తనూజన్: మొదటిదైన పృధ్వి - భూమి పుత్రిక సీతను చూచి 
తృతీయంబు: మూడవదైన అగ్నిని ఆలంకా పట్టణంలో ఉంచి కాల్చి
ద్వితీయంబు: రెండవదైన నీటిని/సముద్రాన్ని దాటి రాముని వద్దకు వచ్చాడు)
-- కవి తెలియదు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి