ఈడేర్చు

 

జనవరి 10, 2023

ఈడేర్చు (iderchu)

    అర్థము

   (క్రియ): నెరవేర్చు; రక్షించు; కాపాడు; సిద్ధింపచేయు

   Meaning

   (verb) : fulfill; save from; protect; accomplish

   వాడుక / Usage

రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులము జెఱచె.
Rama born, fulfilled was Surya Vamsha; Duryodhana alas destroyed Kurus.

   మెదడుకు మేత / Food for thought

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో

కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో

-- మల్లీశ్వరి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి