తిరిపెము
జనవరి 11, 2023
తిరిపెము (tiripemu)
అర్థము
(విశేష్యము): భిక్షము; ముష్టి
Meaning
(noun) : begging; alms
వాడుక / Usage
వెండి బంగరెన్న కొండలైయుండంగ దేవుడేలపోయి తిరిపమెత్తె.
మెదడుకు మేత / Food for thought
యింతేనటే సంద్ర మెంతొయనుకొంటి
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా!
నానీతి నాజాతి
నావారెపోనాడ
మరిగి నామనసు సా
గరమాయెనన్నారు ఇంతే...
నారాజె నాకాసి
వేరు సూపులు సూడ
కడలివలె నా గుండె
కలతబడె నన్నారు ఇంతే...
సత్తె మెరిగినపాప
పొత్తిళ్లలో దాగి
కన్నీరు మున్నీరు
కరిగిస్తి నన్నారు ఇంతే...
అంచుదరి లేదంటె
అమృత ముంటాదంటె
దేము డంతుంటాదొ
ఏమొ యనుకొన్నాను ఇంతే...
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా!
నానీతి నాజాతి
నావారెపోనాడ
మరిగి నామనసు సా
గరమాయెనన్నారు ఇంతే...
నారాజె నాకాసి
వేరు సూపులు సూడ
కడలివలె నా గుండె
కలతబడె నన్నారు ఇంతే...
సత్తె మెరిగినపాప
పొత్తిళ్లలో దాగి
కన్నీరు మున్నీరు
కరిగిస్తి నన్నారు ఇంతే...
అంచుదరి లేదంటె
అమృత ముంటాదంటె
దేము డంతుంటాదొ
ఏమొ యనుకొన్నాను ఇంతే...
--సంద్రం, నండూరి వెంకట సుబ్బారావు (1884 - 1957)
Comments
Post a Comment