వాలాయము
జనవరి 12, 2023
వాలాయము (vaalaayamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): నిర్బంధము; అనివార్యము; అవశ్యము; తప్పక
Meaning
(noun/adv) : compulsory; unavoidable; customary
వాడుక / Usage
కాలగతి యెంతవారికి వాలాయము చులకదనము వచ్చుట యరుదా.
మెదడుకు మేత / Food for thought
స్వప్న జగతిలో ఛాయావీణా
సమదశ్రుతు లెవో సాగునవే!! ||స్వప్నజగతిలో||
అంతరాళమున వింతరంగు లెవో
అలసాలసములై అలమునవే!
రెప్పపాటులో కోటికోటిశశి
రేఖలాశలకు యేగునవే!! ||స్వప్నజగతిలో||
కల్పనాకృతులు కథలు కథలుగా
కదలి మెదలి చెలరేగునవే!
జన్మజన్మగతస్నే హమాధురులు
ఝరులు ఝరుగా మూగునవే!! ||స్వప్నజగతిలో||
జాడజాడలుగ జరిగిపోవు నా
నీడల నా ప్రియు డేడో!
గురుతు వైచికొని, కన్ను మూయగనె
జరిగిపోవు నే నీడో !! ||స్వప్నజగతిలో||
--డా. బాలాంత్రపు రజనీకాంత రావు (జనవరి 29, 1920 - 2018)
Comments
Post a Comment