వారాశి

 

జనవరి 13, 2023

వారాశి (vaaraasi)

    అర్థము

   (విశేష్యము): సముద్రం; సాగరం

   Meaning

   (noun) : sea; ocean

   వాడుక / Usage

దారపుత్ర ధనేషణ త్రయ మనేటి మోహ వారాశిలోన దా మునిగియుండు.
He is drowned in the ocean of attachment to love of wife, offspring and wealth.

   మెదడుకు మేత / Food for thought

అంతులేని లోకాల సముద్ర తీరాన
పిల్లలు కలుసుకున్నారు,
పైన అనంతాకాశం నిశ్ఛలంగా వుంది,
అవిరామంగా సముద్రం పొంగి పొర్లుతోంది,
అంతంలేని లోకాల సముద్ర తీరాన
పిల్లలు అరుపులతో నృత్యాలతో కలుసుకున్నారు.


ఇసుకుతో ఇళ్ళు కట్టుకుంటారు.
ఉత్త ఆల్ఛిప్పలతో ఆడుకుంటారు.
ఎండుటాకులతో పడవలు చేసి
విశాల సముద్రం పైన చిరునవ్వులతో వొదులుతారు
లోకాల సముద్రతీరాన పిల్లలాడుకుంటున్నారు

ఈడద మెట్లానో తెలీదు వారికి.
వలలు వెయ్యడమూ ఎరుగరు.
పల్లెవాళ్ళు ముత్యాలకోసం మునుగుతారు
వర్తకులు ఓడల్లో ప్రయాణమౌతారు

కాని పిల్లలు గులకరాళ్ళని పోగు చేసికొని
వాతిని నీళ్ళల్లో వెదచల్లుతారు
గుప్తభాగ్యరాసుల కోసం వెతకరు
వాళ్ళకి వలలు వెయ్యడం చాతకాదు.

నవ్వులతో పొంగుతోంది సముద్రం
తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది
మృత్యుభయనంకరమైన అలలు
శిశువుకి ఉయ్యాలలూపే తల్లివలె
అర్థంలేని జోలపాటల్ని పాడునతున్నాయి
సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది
తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది

అంతులేని లొకాల సముద్రతీరాన
పిల్లలు కలుసుకున్నారు.
తోవ తెలీని ఆకాశంలో తుఫాను విహరిస్తోంది,
నావలు భగ్నమౌతున్నాయి
మృత్యువు విచ్చలవిడిగా సంచరిస్తోంది
పిల్లలు ఆడుతున్నారు,అంతులేని లొకాల తీరంపైన
పిల్లల గొప్ప సమావేశం జరుగుతోంది

--రవీంద్రుని 'గీతాంజలి' అనువాదం, చలం (మే 18, 1894 - 1979)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి